రాజధాని రైతుల కోసం ఉపగ్రహ సాయం తీసుకుంటున్న ఏపి ప్రభుత్వం

రాజధాని రైతులు కోసం ఉపగ్రహాధారిత డి‌జే‌పి‌ఎస్, ఆర్టికే మోడ్ (రియల్ టైమ్ కైనాటిక్ విధానం) లను ఉపయోగించుకోవాలని ఏ‌పి ప్రభుత్వం నిర్ణయించింది. వాటి సాయంతో రాజధాని గ్రామాల రైతులకు బదులుగా ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లకు హద్దులు ఖరారు చేయాలని తీర్మానించింది. ఈ ప్రక్రియ ఏప్రెల్ ఆఖరు కల్లా పూర్తి చేసేందుకు సి‌ఆర్‌డి‌ఏ సమాయత్తమైంది.

 

ఇప్పటికే మొత్తం 29 గ్రామాల రైతులు ఇచ్చిన భూములకు పూలింగ్ నిబంధనల ప్రకారం కేటాయించిన ఫ్లాట్లతో కూడిన ఎల్పీయస్ లేయవుట్లన్నీట్లో సరిహద్దులు నిర్ణయించే కార్యక్రమం సింగపూర్ కి చెందిన కంపెనీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. వారి తర్వాత సి‌ఆర్‌డి‌ఏ అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో హద్దులు గుర్తిస్తారు. వారిని అనుసరిస్తూ మరో బృందం స్తంభాలను వేస్తుంది. ఆ తర్వాత మరో బృందం సంఖ్యలు మొదలగు వివరాలను నమోదు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని తీర్మానించారు.

ఈ ప్రక్రియ మూడు గ్రామాల్లో మొదలై చురుగ్గా సాగుతుంది. ఇదే కోవలో 4 కోట్ల పైచిలుకు అంచనాతో మరో ఎనిమిది గ్రామాల్లో ఈ ప్రక్రియకు సి‌ఆర్‌డి‌ఏ టెండర్లు ఆహ్వానించింది. వచ్చేనెల 3వ తేదీని గడువుగా నిర్ణయించింది.

అదే రోజు టెండర్లను పరిశీలించి టెక్నికల్ బిడ్లను పరిశీలిస్తారు. అందులో అర్హత సాధించిన వాటికి టెండర్లు ఖరారు చేస్తారు. ఈరకంగా ఏ‌పి చంద్రబాబు ప్రభుత్వం సాంకేతికతకీ మరోసారి పెద్ద పీట వేసినట్ట అయింది.

Follow us on facebook for more updates happening in Guntur. Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *